గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ 10 వికెట్ల నష్టానికి142 రన్లు చేసింది. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచింది. గుజరాత్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు.
నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు.
Vasuki Indicus: ప్రపంచంలో అతిపెద్ద పాము, అంతరించిపోయిన ‘‘టైటానోబోవా’’ అనుకుంటారు. అయితే, తాజాగా గుజరాత్లో కచ్ ప్రాంతంలో భారీ పాముకి సంబంధించిన శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. బహుశా ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము కావచ్చని వారు చెబుతున్నారు.