సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్‌లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది.
Read Also: PM Modi: దేశానికి మంచి బాధ్యతాయుతమైన విపక్షం అవసరం(వీడియో)
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం విన్యాసాలు చేయడానికి ఇద్దరు వ్యక్తులు తమ SUVలను లోతైన నీటిలోకి తీసుకెళ్లారు. అయితే.. సముద్రంలోకి తీసుకెళ్లడంతో అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. రెండు కార్లు వీల్ టాప్స్ వరకు నీటిలో మునిగిపోయాయి. రెండు వాహనాల్లోకి కూడా నీరు చేరింది. వాటితో పాటు యువకులు కూడా నీటిలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు గుర్తించి వారిని కాపాడారు. అనంతరం కార్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Read Also: Trains Cancelled: ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. 45 రోజుల పాటు రద్దు.. 26 రైళ్లు(వీడియో)
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కచ్ పోలీసులు ఆ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. యువకులిద్దరూ తమ కార్లను అక్కడే వదిలి వెళ్లిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రెండు థార్ కార్లను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కార్ల రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
रिल्स का खतरनाक शौक#Gujarat :
Reel बनाने के चक्कर में युवकों ने दो #Thar कारें कच्छ के मुंद्रा के समुद्र किनारे के गहरे पानी में उतारी, हाई टाइड ने दोनों गाड़ी को लगभग अपनी चपेट में ले लिया और दोनों कार पानी में फंस गईं!
ग्रामीणों की मदद से दोनों वाहनों को बाहर निकाला गया,… pic.twitter.com/Dwm7B0YuOq
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) June 23, 2024