Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..
- తన పునర్జన్మ గురించి చెబుతున్న ఐదేళ్ల చిన్నారి
- ఆశ్చర్యపోతున్న గ్రామస్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది. పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది. అమ్మాయి మాటలను నిజం అని అంగీకరించడం వెనుక ఒక వాదన ఏమిటంటే, అమ్మాయి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె పుట్టినప్పటి నుండి గుజరాతీ మాట్లాడే వారితో నివసించింది. కానీ కొన్నిసార్లు ఆమె హిందీలో అనర్గళంగా మాట్లాడటం ప్రారంభించింది. ఆమె గత జీవిత కథను హిందీలో చెప్పడం ప్రారంభించింది.
అసలు విషయమేమింటే గుజరాత్‌లోని బనస్కాంత ప్రాంతంలో నివసించే ఐదేళ్ల చిన్నారి దక్ష.. ఇది తన పునర్జన్మ అని చెప్పింది. దక్ష హిందీ మాట్లాడినప్పుడు ఆమె కుటుంబంతో సహా గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు. 23 ఏళ్ల క్రితం తాను కచ్ జిల్లాలోని అంజర్ ప్రాంతంలో నివసించినట్లు ఆ బాలిక తెలిపింది. గత జన్మలో తనతో పాటు తన కుటుంబం 2001 భూకంపంలో మరణించారని వెల్లడించింది. దక్ష వాదనలతో కూడిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ప్రస్తుతం దక్ష తన తల్లిదండ్రులతో ఖాసా గ్రామంలో నివసిస్తుంది. దక్ష తండ్రి జేతాజీ ఠాకూర్ వ్యవసాయం పనిచేస్తున్నాడు. జేతాజీ ఠాకూర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన కుమార్తె చుట్టూ ఎవ్వరూ ఎప్పుడూ హిందీ మాట్లాడరని ఆ బాలిక తండ్రి జేతాజీ ఠాకూర పేర్కొన్నారు. కానీ ఆమె హిందీని అనర్గళంగా మాట్లాడటం ఎక్కడ నుండి నేర్చుకుందో తనకు తెలియదన్నారు. జేతాజీ ఠాకూర్, అతని భార్య గీతాబెన్ మొదటిసారిగా దక్ష హిందీ మాట్లాడటం విన్నప్పుడు.. వారు ఆమెతో మాట్లాడి హిందీ మాట్లాడటం ఎలా నేర్చుకున్నారని అడిగారు. అప్పుడు దక్ష దేవుడు తనను ఇక్కడికి పంపాడని చెప్పింది. ఆమె మునుపటి జీవితంలో అంజార్‌లో నివసించిందని, ఆమె పేరు ప్రింగిల్ అని తెలిపింది. దక్ష తాను అంజార్‌లో నివసించినట్లు, ఆమె మరణించిన రోజున పాఠశాల నుంచి తిరిగి వస్తున్నట్లు చెబుతోంది. భవనం పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని చెప్పింది. మళ్లీ అంజర్ వద్దకు వెళ్లాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు, దక్ష వెళ్లనని, ఇక్కడే ఉంటానని తెలిపింది.
దక్ష తల్లిదండ్రులు ఏమంటున్నారంటే?
దక్ష తండ్రి జేతాజీ ఠాకోర్ ప్రకారం, ఆమె మొదట్లో హిందీ మాట్లాడటం ప్రారంభించినప్పుడు మేము పట్టించుకోలేదు. కానీ హిందీలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు మేము ఆమెను తిట్టినప్పుడు, ఆమె తన గత జీవిత కథను చెప్పింది. తాను అంజర్‌లో నివసించానని, భూకంపంలో చనిపోయానని చెప్పింది.
తాజావార్తలు
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!