Dead Frog In Packet Of Chips: చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప..
- చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయి కప్ప..
- గుజరాత్‌లో ఘటన..
- విచారణ ప్రారంభించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Frog In Packet Of Chips: డబ్బులు పెట్టి కొన్నా కూడా క్వాలిటీ లభించడం లేదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యత లోపించింది. ఇటీవల కాలంలో ఆహారంలో చనిపోయిన బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ముంబైలో ఐస్‌క్రీమ్‌లో తెగిన వేలు కనిపించిన వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాణ్యత పాటించకపోవడంతో కస్టమర్లు అస్వస్థతకు గురవ్వడం కొన్నిసార్లు ఫుడ్ ఫాయిజనింగ్‌తో చనిపోవడం జరుగుతోంది. సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే అధికారులు, ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Also: Renuka Swami Murder:రేణుకాస్వామిని తన్నిన షూ విజయలక్ష్మి ఇంట్లో.. మూడు బైకులు సీజ్?
Also Read
ఇదిలా ఉంటే తాజాగా చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. జామ్‌నగర్‌లో పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. బాలాజీ వేఫర్స్ తయారు చేసిన క్రంచెక్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిందని జాస్మిన్ పటేల్ అనే వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిజంగానే కుళ్లిపోయిన కప్ప కనిపించనట్లు విచారణలో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి డీబీ పర్మార్ తెలిపారు.
పుష్క్ ధామ్ సొసైటికి చెందిన పటేల్ తన మేనకోడళ్ల కోసం మంగళవారం సాయంత్రం సమీపంలోని దుకాణం నుంచి చిప్స్ ప్యాకెట్స్ కొనుగోలు చేశారు. కప్పను గుర్తించే కన్నా ముందు తన మేనకోడలు కొన్నింటిని తిన్నట్లుగా అతను చెప్పాడు. ముందుగా చెప్పినప్పుడు ఈ విషయాన్ని తాను నమ్మలేదని, ఆ తర్వాత బాలాజీ వేఫర్స్ డిస్ట్రబ్యూటర్స్, కస్టమర్ కేర్ సర్వీస్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!