గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కచ్ఛ్‌లోని ఆగ్రోటెక్ కంపెనీలో బురద ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు బుధవారం మరణించారు. క్లీన్ చేస్తుండగా ఒకరు అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు.. అతనిని రక్షించడానికి మరో ఇద్దరు కార్మికులు దిగారు.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Crime: గుజరాత్‌లోని కచ్‌లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
దేశ వ్యాప్తంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం నమోదు కార్యక్రమం అక్టోబర్ 12న ప్రారంభమైంది. నెలకు రూ.5,000 స్టైపెండ్‌ని అందించే ఈ పథకం శనివారం ప్రారంభమైంది. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌తో సహా పలు సంస్థల్లో ఆఫర్‌లు లభించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
విజయ దశమి రోజున గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని జసల్‌పూర్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ గోడ కూలి ఏడుగురు మరణించారని మెహసానా జిల్లా ఎస్పీ తరుణ్ దుగ్గల్ తెలిపారు.
Gujarat Gang-Rape: గుజరాత్ సూరత్ జిల్లాలో టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితుల్లో ఒకరు గురువారం విచారణ సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను మరణించాడు. గతంలో హత్య, దొంగతనం కేసుల్లో పేరున్న శివశంకర్ చౌరాసియా(45), మున్నా పాశ్వాన్(40)లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
Gujarat: గుజరాత్ వడోదరలో దారుణం జరిగింది. తన ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజ్ యువతిపై గుర్తుతెలియన వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె స్నేహితుడిని అడ్డుకున్న దుండగులు బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవరాత్రి సందర్భంగా గర్భా ఈవెంట్ కోసం నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు జరిగింది.
Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
ఆ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రోజూ ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్నారు. షికార్లు చేస్తున్నారు. హాయిగా ప్రేమ ఊహాల్లో విహరిస్తున్నారు. అయితే ఏకాంతంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు.
Gujarat : గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా హిమ్మత్ నగర్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.