దేశ వ్యాప్తంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం నమోదు కార్యక్రమం అక్టోబర్ 12న ప్రారంభమైంది. నెలకు రూ.5,000 స్టైపెండ్‌ని అందించే ఈ పథకం శనివారం ప్రారంభమైంది. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌తో సహా పలు సంస్థల్లో ఆఫర్‌లు లభించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
10, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా BA, B.Sc., B.Com, BCA, BBA, B. ఫార్మా చదివిన 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం పోర్టల్ శనివారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ప్రసిద్ధ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి 21 నుంచి 24 ఏళ్ల వయస్సు గల యువత దీని కోసం అప్లై చేయవచ్చు. దీని ఇంటర్న్‌షిప్ వ్యవధి 12 నెలలు. ఇంటర్న్‌షిప్ వ్యవధిలో కనీసం సగం తరగతి గదిలో కాకుండా వాస్తవ పని అనుభవం లేదా ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపులు..
అర్హతగల అభ్యర్థులు pminternship.mca.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి ఇంటర్న్ స్టైపెండ్‌గా రూ. 5000 అందుకుంటారు. ఇందులో రూ.4500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రూ. 500 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంబంధిత కంపెనీ ఇస్తుంది. ప్రతి ఇంటర్న్ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేయబడతారు.
ఇది కూడా చదవండి: Crocodile: కాన్పూర్‌లో మొసలి హల్‌చల్.. భయాందోళనకు గురైన ప్రజలు
అక్టోబర్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన తర్వాత ఇది అక్టోబర్ 26 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత అక్టోబర్ 27 నుంచి ఎంపికైన యువతకు ఇంటర్న్‌షిప్ చేయడానికి కంపెనీని కేటాయించనున్నారు. నవంబర్ 7వ తేదీలోపు జాబితాను విడుదల చేసిన తర్వాత, నవంబర్ 8 నుంచి 25వ తేదీ వరకు ఆఫర్ లెటర్లు పంపిస్తారు. ఆ తర్వాత ఇంటర్న్‌లు డిసెంబర్ 2 నుంచి వారి సంబంధిత కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభిస్తారు. మొత్తం పథకంలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేస్తున్నప్పుడు అక్టోబర్ 11 నాటికి రిజిస్టర్ అయిన కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రతి ఇంటర్న్‌కు గరిష్టంగా ఐదు ఎంపికలు ఇవ్వబడతాయి. ఇక తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు లేదా పూర్తి సమయం కోర్సులు చదువుతున్న యువకులు వీటికి దరఖాస్తు చేసుకోలేరు. IIT, IIM, నేషనల్ లా యూనివర్సిటీ, IISER, NIT, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నుంచి డిగ్రీలు పొందిన యువత దరఖాస్తులు అంగీకరించబడవు.
PM Internship Scheme is a transformative initiative by the Hon'ble PM Shri @narendramodi-led government to ensure the skilling of our youth, which will enhance their employability.
· It will provide an opportunity to do an internship in the Top 500 companies in India for 12… pic.twitter.com/iQPLsChVe1
— Ministry of Corporate Affairs (@MCA21India) October 12, 2024