Gujarat: గుజరాత్‌లో విషాదం.. గోడ కూలి ఏడుగురు మృతి
- విజయ దశమి రోజున గుజరాత్‌లో ఘోర విషాదం
- గోడ కూలి ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ దశమి రోజున గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని జసల్‌పూర్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ గోడ కూలి ఏడుగురు మరణించారని మెహసానా జిల్లా ఎస్పీ తరుణ్ దుగ్గల్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలిలో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. వారికోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంంది.
Also Read
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రమాదం జరిగిందని మెహసానా జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ హస్రత్ జాస్మిన్ తెలిపారు. సమాచారం ప్రకారం 9-10 మంది చిక్కుకున్నారని తెలిపారు. అందులో 19 ఏళ్ల యువకుడు సజీవంగా బయటపడ్డాడని చెప్పారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఇంకా సజీవంగా ఉన్నారని తెలిపారు.
#WATCH | Gujarat: Rescue operation underway after the wall of a private company collapsed near Jasalpur village in Kadi taluka of Mehsana district pic.twitter.com/ssI7mQlAMK
— ANI (@ANI) October 12, 2024
#WATCH | Gujarat: District Development Officer (DDO) of Mehsana, Dr. Hasrat Jasmine says, "This is a private company which was under construction. The incident happened around 1.45 pm. As per our information, 9-10 people were trapped, out of which 6 bodies have been recovered. A… pic.twitter.com/QUeiYC07GL
— ANI (@ANI) October 12, 2024
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!