Fake Court: ఇప్పటి వరకు మనం చాలానే ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాము. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు బట్టబయలైంది. ఈ కేసులో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నకిలీ కోర్టు పట్టుబడింది. వృత్తిరీత్యా నకిలీ జడ్జిగా, లాయర్‌గా నటిస్తూ గత కొన్నేళ్లుగా ఈ మోసం వ్యాపారం సాగుతోంది. అసలు విషయం తెలియగానే ప్రజలు షాక్ అవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అహ్మదాబాద్ సివిల్ కోర్టు ముందు నకిలీ న్యాయమూర్తి తన నకిలీ కోర్టును నడుపుతున్నాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ కోట్ల విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులో పలు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో కొన్ని ఉత్తర్వులు డీఎం కార్యాలయానికి చేరాయి.
Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మీసాలు, గడ్డాలు తీయాల్సిందే..!
అయితే, అక్కడ దీనికి సంబంధించిన కేసు అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తికి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రిజిస్ట్రార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మోరిస్ క్రిస్టియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నకిలీ ట్రిబ్యునల్‌ను సృష్టించి తనను తాను న్యాయమూర్తిగా చెప్పుకున్నాడు. అహ్మదాబాద్ లోని భదర్ లోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌పై కరంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన దాఖలు చేసిన ఫిర్యాదులో, నిందితులు ఇతర వ్యక్తులతో కలిసి ఠాకూర్ బాపూజీ ఛనాజీ పేరుతో నేరపూరిత కుట్ర పన్నారని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి సమాచారం ప్రకారం.. నకిలీ న్యాయమూర్తి మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌పై ఫిర్యాదు వచ్చినప్పుడు, సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని చౌతియా పోలీసులను ఆదేశించారు. నకిలీ కోర్టులో ఉంచిన కంప్యూటర్లు, సీపీయూలు, ఇతర పరికరాలను సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారు. అహ్మదాబాద్‌లోని నకిలీ కోర్టు బయటపెట్టడంతో.. ఓ ఫేక్ జడ్జి ఏళ్ల తరబడి ప్రజలను ఎలా మోసం చేస్తూనే ఉన్నాడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.