దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Shraddha Kapoor: రిలేషన్‌లో ప్రభాస్ హీరోయిన్..ఎట్టకేలకు ఒప్పేసుకుంది!
మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం దక్షిణ కేరళ మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీంతో తమిళనాడు మీదుగా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతోంది. దీంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమించుకునే అవకాశం ఉంది.
అక్టోబరు 16న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 14-17 వరకు తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్, అక్టోబర్ 17-18 మధ్య కేరళ మరియు మాహే, అక్టోబర్ 15-16 తేదీలలో కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం, అక్టోబర్ 15-17 వరకు రాయలసీమ మరియు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 17న సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలో వర్షాలు కురుస్తాయి.
ఇది కూడా చదవండి: Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!