సూరత్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ల ట్యాంపరింగ్ కేసు బట్టబయలైంది. విచారణలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు విధ్వంసానికి సంబంధించిన మొత్తం కథను రూపొందించారని తేలింది.
గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్‌లైన్‌లో వస్త్ర దుకాణం పేరుతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి నిల్వ చేస్తున్నారు.
Gujarat : ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇప్పుడు గుజరాత్‌లోనూ రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర పన్నిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఆస్పత్రి అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ వార్డు అయితే మరిన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వరు. అంతేకాకుండా లోపలికి చెప్పులు వేసుకుని రానివ్వరు. రోగికి ఇన్ఫెక్షన్లు అంటకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు.
జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, పెట్టుబడులకు ఆహ్వానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విధానాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..
Gujarat: గుజరాత్లో దారుణం జరిగింది. మనవడిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాల్సిన బామ్మే కసాయిగా మారింది. 14 నెలల చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి చంపింది. రాష్ట్రంలోని అమ్రేలి తాలుకాలో ఈ ఘటన జరిగింది. నిందితురాలైన మహిళ మనవడు నిరంతరం ఏడుస్తున్నాడనే కోసంతో అతడిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది.