గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది.
Explosion In IOCL: గుజరాత్‌లోని వడోదరలోని కోయలీ ప్రాంతంలోని ఐఓసీఎల్ రిఫైనరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుండి పొగలు కమ్ముకున్నాయి. స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లను వాడారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా సమీపంలోని కంపెనీలు, ఆయా ప్రాంతాలలో గందరగోళం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో రిఫైనరీలో ఉన్న…
గుజరాత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక కట్టడం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరిని సురక్షితంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Modi Diwali Celebrations: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని కచ్‌కు చేరుకున్నారు. అక్కడ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దీపావళి రోజున సైనికులతో గడపాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని మోడీ కచ్‌లో భారత సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్నారు. ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌లోని సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి. కాబట్టి, ప్రధాని మోడీకి ఈ పర్యటన ప్రత్యేకం. గతంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా…
ప్రధాని మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా కుమారుడు ద్రవ్య ధోలాకియా వివాహానికి హాజరయ్యారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. దీపావళి రోజున గుజరాత్ ప్రజలకు వేలకోట్ల విలువైన బహుమతులు ఇవ్వనున్నారు.
Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.