రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. మీరు తరచూ రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నారా? ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తున్నారా..? అయితే, ఇది మీకోసమే..! ఎందుకంటే.. అన్నింటినీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను రద్దు చేస్తే జీఎస్టీ చెల్లించాలి.. దీంతో, ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ మరింత ఖరీదు కానుంది.. అంటే..…
దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో…
కేంద్రంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దక్షిణ భారత దేశంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. నల్లగొండ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.23వేల కోట్ల నిధులు కేంద్రం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర విధానాలు దేశమగ్రతకు మంచిది కాదని.. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బ్రాహ్మండంగా…
సామ్యాన్యులపై మరో బాదుడు షురూ కానుంది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల పాకెట్ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడుతున్న జనాలకునేటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యంమైంది. ఈనేపథ్యంలో.. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. అయితే.. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాగా..ఈ సమావేశంలో పలు…
నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మరిన్ని నిత్యావసరాల ధరలు పెరుగనున్నట్లు తెలిసింది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో జూలై 18 తరువాత నుంచి పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. దీంతో మరింతగా సామాన్యుడిపై భారం పడబోతోంది.…
దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం…
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై జీఎస్టీని భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది జీఎస్టీ కౌన్సిల్.. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది