Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను(GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. Most Wanted…
రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు…
నేటి నుంచి జీఎస్టీ 2.o అమల్లోకి రానుంది.. ఇవాళ్టి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు అమలు చేస్తున్నారు.. దీంతో, పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు.
జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్‌వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.
సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది.
స్టాక్ మార్కెట్‌కు జీఎస్టీ ఊరట కలిసొచ్చింది. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా జీఎస్టీ స్లాబ్‌లను కేంద్రం తగ్గించింది. దీంతో వస్తువుల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర నిర్ణయం మార్కెట్లకు బాగా కలిసొచ్చింది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చింది. ఆగస్టు నెలలో రూ. 1.86 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 6.5 శాతం ఎక్కువ. ఆగస్టు 2024లో రూ. 1.75 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. మరోవైపు, గత నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 2025లో, జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్లు…