ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను…
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.వెయ్యి లోపు ఉండే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే గార్మెంట్స్‌పై ఇప్పటివరకు అమలు చేస్తున్న ఐదు శాతం జీఎస్టీ జనవరి నుంచి 12 శాతానికి పెరగనుంది. దీంతో వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. సాధారణంగా గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ.వెయ్యి లోపు విలువ ఉండేవే ఉంటాయి. ఈ నెల 18న రూ.వెయ్యి విలువ గల గార్మెంట్స్ మీద జీఎస్టీ శ్లాబ్‌ను 12 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం…
దేశంలో కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అక్టోబరులో దేశవ్యాప్తంగా రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఈ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 23,861 కోట్లు కాగా ఎస్‌జీఎస్టీ వసూళ్లు 30,421 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వచ్చాయి.…
జీఎస్టీ పరిహారం బదులుగా రుణాలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 44 వేల కోట్లు రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.59 లక్షల కోట్లు విడుదల చేసింది కేంద్రం.కరోనా సెకండ్‌వేవ్, లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సగానికి సగం ఆదాయం పడిపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాయ్. ఐతే రాష్ట్రాలకు ఊతం ఇచ్చేందుకు ముందుకొచ్చింది కేంద్రం.…
పెట్రో ధరల మంట సామాన్యుడికి భారంగా మారిపోతోంది.. పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పైకి ఎగబాకుతుండడంతో.. నిత్యావసరాలు మొదలు, ఇతర వస్తువలపై కూడా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే, పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన ప్రతీసారి.. ఇక, ఈ సారి.. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. అయితే, పెట్రోల్, డీజిల్…
కరోనా ఎంట్రీతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇదే సమయంలో వాహనరంగం స్తంభించిపోయింది. ఈ కారణంగాపెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా తగ్గింది. బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రో, డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే భారత్ లో ఇందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం శోచనీయంగా మారింది. గత కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధరలు రూ.60 రూపాయలు ఉంటే ఇప్పుడది ఏకంగా సెంచరీని దాటేసింది.…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో…
బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో కమలదళం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో మోదీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో మోదీ సర్కారు రెండోసారి సైతం అధికారంలోకి వచ్చింది. అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. జనాల…
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.. త్వరలోనే ప్రజలకు…