Raja singh Counter To KTR: మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతూ వుంటుంది. తాజాగా గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కి కౌంటరేశారు. ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా? అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మా ముగ్గురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు కదా. ఎంపీల సస్పెన్షన్ గురించి ట్వీట్ చేసే అధికారమే నీకు లేదు. ఓటీటీ లో ఏమి చూడాలని అడుగుతున్నావు కదా? కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడు. మోదీ, అటల్ బిహారీ వాజపేయి చరిత్ర చదువు. నాస్తికుడి నుంచి ఆస్తికుడవు అవుతావు అన్నారు రాజా సింగ్.
అంతకుముందు రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!

జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసన తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ వారం రోజులపాటు సస్పెండ్ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. మిగిలిన 16 మందిలో ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఆరుగురు డీఎంకే ఎంపీలు, ఇద్దరు సీపీఎం ఎంపీలు, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు. బుధవారం పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
Rowdy Sheeter Remand: బాలికపై అత్యాచార యత్నం.. రౌడీషీటర్ కి రిమాండ్
- Tags
- 3 mlas supend
- assembly
- GST
- inflation
- ktr
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు