2017 జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ విధానాలను ఖరారు చేసే జీఎస్టీ కౌన్సిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని ధర్మాసం స్పష్టం చేసింది. జీఎస్టీపై చట్టాలను మార్చడానికి పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు సమాన హక్కులు ఉన్నాయని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 246ఏ…
ప్రస్తుతం జీఎస్టీని నాలుగు శ్లాబులుగా వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. 5, 12, 18, 28 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి.. రాష్ట్రాల ఆదాయాన్ని పెంపొందించేందుకు, జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో భారీ వినియోగంతో కూడిన కొన్ని వస్తువులను 5 శాతం శ్లాబ్ నుంచి 3 శాతం పెంచి 8 శాతం శ్లాబ్‌ను తెచ్చే అవకాశం ఉందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బంగారం మరియు ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు ఉంటుంది.. ఇది…
దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ల కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు వచ్చిన సమాచారంతో.. రైడ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ల కార్యాలయాలపై జీఎస్టీ అధికారుల దాడులు సంచలనం రేపాయి. ముంబైలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఏజెన్సీ వజీరిక్స్ ఆఫీసులో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 40.5 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేత, వడ్డీ, జరిమానాతో కలిపి 49.20 కోట్లు వసూలు చేశారు. ఈ ఎక్స్ఛేంజీని…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్. మోదీ ప్రభుత్వం మనందరికీ అందించిన నూతన సంవత్సర బహుమతి కొత్త ద్రవ్యోల్బణం. గత ఏడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన కానుక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. బట్టలు, పాదరక్షలు కొనుక్కోవడం దగ్గర్నుంచి ఏటీఎంల నుంచి సొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వరకు ఖరీదు అయ్యాయన్నారు. పెరిగిన GST…
ఏ అంశంపైనా ప్రజా ఉద్యమాలు చేయాలన్నా ఎర్ర పార్టీల స్టైలే వేరు.. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టడం వారికే చెల్లుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.చెప్పులను నెత్తిపై పెట్టుకున్న వినూత్నంగా నిరసన తెలిపిన నారాయణ. చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బీజేపీ తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులపై జీఎస్టీ…
వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్ సమావేశం… వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్.. టెక్స్‌టైల్స్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రాలు…
వస్ర్త పరిశ్రమపై అదనపు జీఎస్టీ విధించేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, అప్పుడే రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.. వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.. జనవరి 1వ తేదీ నుంచి వస్ర్త పరిశ్రమపైన విధించబోతున్న అదనపు జీఎస్టీ పన్ను ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన..…
ప్రభుత్వం అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తోంది.. కొన్ని శ్లాబుల్లో జీఎస్టీని సవరిస్తూ వస్తున్నారు.. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నవాటిని కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.. ఇక, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. అవి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.. ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదుగా…
పన్ను చెల్లింపుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నది. జనవరి 1, 2022 నుంచి ఈ నిబంధనలు అమలుకాబోతున్నాయి. ఆర్థిక చట్టం 2021లో భాగంగా సవరణలు చేస్తున్నారు. దీంతో పరోక్ష పన్ను విధానం మరింత కఠినం కాబోతున్నాయి. వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు పైన ఉన్న కంపెనీ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్ 1 అనేది సేల్స్ ఇన్వాయిస్ చూపించే రిటర్న్, జీఎస్టీఆర్ 3బీ అనేది…