Kishan Reddy: చండూరు సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Slams Cm Kcr Speech: చండూరు సభలో ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు మాట్లాడారు. నిరాశ, నిస్పృహతో ముఖ్యమంత్రి మాట్లాడారు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఇప్పుడు మాట్లాడారు.. అవి నెరవేరితే ఎందుకు మళ్ళీ మాట్లాడటం. గత ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలనే గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్ళీ మాట్లాడారని విమర్శించారు. నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఏ పార్టీలో గెలిచారో చెప్పాలి.. అక్రమంగా, దొడ్డి దారిన మీ పార్టీలో వారిని చేర్చుకుని నైతిక విలువలు గురించి మాట్లాడుతున్నారు..
మొయినా బాద్ సంఘటనలో FIR లో డబ్బులకు సంబంధించిన వివరాలు ఎందుకు పొందుపరచలేదు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రెస్ టీఆర్ఎస్..వైఎస్సార్ పార్టీ ఎమ్యెల్యే, ఎంపీని మీ పార్టీలో చేర్చుకోలేదా.? ఏ రకంగా కమ్యూనిస్ట్ నాయకులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు.? సీపీఎం ఎమ్యెల్యే ను కూడా చేర్చుకుని మీ పార్టీలో కలుపుకుని ఆ పార్టీ గొంతు నొక్కారు. 32 మంది ఎమ్యెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ ఎంపీ మల్లారెడ్డిని మీ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ లో అభద్రతా భావం, అపనమ్మకం పెరిగింది.. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Read Also: KishanReddy Press Meet Live: కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
ఎన్నికల సభలో నలుగురు ఎమ్యెల్యేలను చూపించారు..వాళ్ళనెందుకు ప్రగతి భవన్ లో బంధించారు.. అన్ని అబద్దాలు కానీ, ఒక నిజం చెప్పారు.. దున్నపోతుకు గడ్డేసి.. అవుకు పాలు పిండితే వస్తాయా.? అట్లనే టీఆర్ఎస్ పార్టీ ఉంది.. తొమ్మిది ఏళ్లుగా చేయని అభివృద్ధి పదిహేను రోజుల్లో చేస్తానని చెప్తున్నారు. జీఎస్టీ లో చేనేత కార్మికులకు నలబై లక్షల లోపు టర్నోవర్ ఉంటే వారికి ఎటువంటి పన్ను ఉండదు.. జీఎస్టీ కౌన్సిల్ పన్ను నిర్ణయిస్తుంది..జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు. వాజ్ పేయి ఫ్లోరైడ్ బాధితుల గురించి తెలుసుకున్న వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేసారు.. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నీరు గార్చింది.. కేసీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి. రూ.800కోట్లను ఫ్లోరైడ్ నివారణకు డబ్బులు ఇచ్చింది కేంద్రం. దమ్ము ధైర్యం ఉంటే దీన్ని నిరూపించండి. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వెందుకు సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Read Also: Prashant Kishor: ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే బీజేపీ నురగలాంటిది.. దాన్ని దెబ్బతీయలేం..
మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన లేదు.. ఎక్కడ చెప్పలేదు. మీరు పెట్టాలనుకుంటే మేము అడ్డుకుంటాం..మీ అన్యాయాలపై మీటర్లు పెడతాం. మేము అధికారంలోకి వచ్చాక.. మీ అవినీతికి మీటర్లు పెట్టి కక్కిస్తాం.. ఊర్లలో బెల్టు షాపులు ఉన్నాయి.. కానీ అభివృద్ధి లేదు. 24గంటలు బెల్ట్ షాప్స్ నడుస్తున్నాయి.. ఊర్లకు రోడ్లు లేవు.. బస్సులు రావు కానీ.. బెల్ట్ షాప్స్ ఉన్నాయి. నువ్వు ప్రధాన మంత్రి అయితే దేశ వ్యాప్తంగా బెల్ట్ షాప్స్ పెడ్తావా.? సభకు విద్యాసంస్థల బస్సులను.. ఆర్టీసీ బస్సులను వాడుకుని వాటిలో మద్యం పంచుతుందన్నారు.
తెలంగాణ నీ ఒక్కడి వల్ల రాలేదు. కుటుంబానిదో, పార్టీదో కాదు. ఎల్లకాలం ఏలడానికి కాదు తెలంగాణ..రాచరిక రాజకీయాలకు తెలంగాణ ఘోరీ కట్టింది.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని.బిచ్చ గత్తెని చేసావన్నారు కిషన్ రెడ్డి.
- Tags
- 4mlas
- bandi sanjay
- BJP vs TRS
- cm kcr
- GST
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!