తెలంగాణలో నాలుగవ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ టీఆర్ఎస్ రెండూ ఒకటే అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో బీజేపీపై యుద్ధం చేస్తున్నా.. ఢిల్లీలో మాత్రం ఇద్దరూ కలిసే నడుస్తున్నారని రాహుల్ విమర్శలు చేశారు. పాదయాత్రలో తెలంగాణ ప్రజల గొంతు వింటున్నాం అన్నారు రాహుల్ గాంధీ. చేనేత కార్మికులకు మేం అండగా నిలబడతాం.
Read ALso: Bombay High Court: పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదు.. వీడియో చిత్రీకరణ నేరం కాదు..
తెలంగాణలో మన ప్రభుత్వం వస్తే విద్యారంగంపై బడ్జెట్ పెంచుతాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం… శిక్షణ ఇస్తాం.. యువత కలలు సాకారం అవుతాయన్నారు. : మన డబ్బు మనకు చేరడం లేదు..దేశంలో ముగ్గురు వ్యాపారుల దగ్గరే డబ్బు చేరుతుంది.. దేశం మొత్తాన్ని ప్రయివేటు పరం చేస్తున్నారని మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.
జడ్చర్ల లో రాహుల్ పాదయాత్ర కి భారీగా జనం తరలివచ్చారు. అయితే, జడ్చర్ల దారి వెంట ఉన్న వీధి లైట్లు బంద్ చేశారు మున్సిపాలిటీ అధికారులు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. కేసీఆర్ ప్రభుతం లాక్కున్న దళిత..పేదల…భూములు వెనక్కి ఇస్తాం అని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షల మంది చెనేతల పై 18 శాతం జీఎస్టీ వేసింది ప్రభుత్వం. వాళ్ళ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మేము అధికారంలోకి వస్తే జీఎస్టీ రద్దుచేస్తాం అన్నారు.
ఇదేం పెద్ద విషయం కాదన్నారు. తెలంగాణ ప్రజల సమస్య వింటున్నానన్నారు. రైతులు,దళితులు, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు మోడీ. ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఒరిగిందేంలేదు. కేసీఆర్.. దళితుల భూములు లాక్కుంటున్నారు. వారికి మేం న్యాయం చేస్తాం అన్నారు రాహుల్ గాంధీ. ఈ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు. రాహుల్ సభకు జనం నీరాజనం పలికారు.
Read ALso: Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డికి EC షాక్.. 48 గంటలు నిషేధం