బీజేపీ సర్కారు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో కమలదళం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో మోదీ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో మోదీ సర్కారు రెండోసారి సైతం అధికారంలోకి వచ్చింది. అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక మోదీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. జనాల…
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.. త్వరలోనే ప్రజలకు…
తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మించిన సినిమా ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ బాగుందని, అలానే సినిమా కాన్సెప్ట్ ను దర్శకుడు తనకు చెప్పారని, అది కూడా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా ద్వారా చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని అన్నారు.…
వస్తు సేవల పన్ను రికార్డు స్థాయిలో వసూలు అవుతోంది. జులై 2021లో రూ.1,16,393 కోట్లు రాగా.. ఆగస్టు మాసానికి రూ.1,12,020 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టులో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లుగా ఉంది. స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లుగా ఉన్నాయి. వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. జులై నెలతో పోలిస్తే…
విశాఖలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భారీ జీఎస్టీ మోసంకి పాల్పడింది. శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 69కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎండీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కంపెనీకి చెందిన అకౌంట్స్, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేసింది ఆదాయపన్ను శాఖ. 2006నుంచి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నడిపిన శ్రీపాద్ ఇన్ఫ్రా… ఇప్పటి వరకు నాలుగు సార్లు కంపెనీ పేర్లు మార్చి వ్యాపారం చేసాడు.…
జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రజలను నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా…
పెట్రోల్, డీజిల్ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ..…
కరోనా సమయంలోనూ వరుసగా లక్ష కోట్లను దాటుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ సారి పడిపోయాయి.. 8 నెలల తర్వాత జూన్‌లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల దిగువకు చేరాయి.. తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ గత నెలలో రూ. 92,849 కోట్లు వసూలైంది.. ఇందులో సీజీఎస్టీ రూ. 16,424 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ. 20,397 కోట్లుగా ఉంది.. ఇక, ఐజీఎస్టీ రూ. 49,079 కోట్లు, వస్తువుల దిగుమతులపై రూ. 25,762 కోట్లు.. వస్తువుల…
పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది.. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు.. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న నిర్మలా సీతారామన్.. అంతర్జాతీయ…
తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదన్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేనని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హరీష్‌రావు.. గత బడ్జెట్‌లో కేంద్ర…