2017 జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ విధానాలను ఖరారు చేసే జీఎస్టీ కౌన్సిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని ధర్మాసం స్పష్టం చేసింది. జీఎస్టీపై చట్టాలను మార్చడానికి పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు సమాన హక్కులు ఉన్నాయని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 246ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానమే అని, పన్నుల విధానంపై పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Navjot Singh Sidhu: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష
సముద్ర జలాల మీదుగా దిగుమతి చేసుకునే వస్తువులపై లెవీ రూపంలో ఐ జీఎస్టీని కేంద్రం విధించడాన్ని 2020లో గుజరాత్ హైకోర్టు కొట్టేయడంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ గుజరాత్ హైకోర్టు తీర్పునే దేశ అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది. ఈ మేరకు జీఎస్టీపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోద యోగ్యమైన, హేతుబద్ధమైన పరిష్కార మార్గం చూపాలని సుప్రీంకోర్టు సూచించింది. 279 అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం స్వతంత్రం కాదని వ్యాఖ్యానించింది.