మురమళ్ల సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన పార్టీ… సీఎం వైఎస్ జగన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఆ పార్టీ నేతలు.. సీఎం జగన్ ఈ రాష్ట్రానికి ఉత్తుత్తి పుత్రుడు అంటూ సెటైర్లు వేశారు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్.. రాజకీయ విమర్శలు చేయడానికే సీఎం జిల్లాకు వచ్చారని దుయ్యబట్టిన ఆయన.. విద్యుత్ ఉద్యోగులకు 13వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదు.. వాటి సంగతి చూడండి…
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తన పదవికి రాజీనామా చేశారు.. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.. తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించినట్లు తెలిపారు బిప్లబ్ కుమార్ దేబ్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నేను పని చేయాలని పార్టీ కోరుకుంటోంది.. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు.…
ఏపీలో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రులను మార్చడం కాదు.. ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి. నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం అన్నారు. రాష్ట్రం లో చిన్న ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా అన్నారు. హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా. గవర్నర్…
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో…
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయ్. గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్‌తో రెండు వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్‌భవన్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు మంత్రులు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి వేడెక్కిందని పరిశీలకు భావిస్తున్నారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి…
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో…
తెలంగాణలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ ఎపిసోడ్ నలుగుతున్న వేళ ప్రోటోకాల్ వివాదం పై మాట్లాడటానికి ఇష్టపడలేదు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. వివాదం ఏమి లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంట్లు సంతోషాన్ని కలిగించాయి. ఏజెన్సీ ప్రాంతంలోనీ పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో గవర్నర్ మీడియాతో ముచ్చటించారు. తాజా వివాదంపై ఆమె మాట్లాడడానికి అయిష్టత చూపించారు. భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమానికి…
తెలంగాణలో ప్రభుత్వానికి-రాజ్ భవన్ కి మధ్య అగాథం పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. వరుస పర్యటనల్లో ఆమెకు అవమానంగా జరుగుతోందని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. స్రోటోకాల్ సమస్య పై చెప్పాల్సిన చోట చెప్పానన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ పట్ల అధికారులు అనుసరిస్తున్న ప్రోటోకాల్ సమస్యపై చెప్పాల్సిన చోటే తాను చెప్పానని ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఏమీ లేదని గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆయన్ని బతిమాలుతూ, బామాలుతూ,, సర్దిచెబుతున్నారు వైసీపీ నేతలు. సలహాదారు సజ్జల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. జాబితా ఫైనల్ చేశారు సీఎం జగన్. కాసేపట్లో గవర్నర్ వద్దకు పంపనున్నారు మంత్రుల జాబితా. అన్నీ ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ కృష్ణా: జోగి రమేష్…