హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి, నూలు కండువా, గరికమాలతో రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వినాయక ఊరేగింపులో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి కైరంకొండ సంతోష్ నేత ప్రారంభించి, ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్…
తెలంగాణ రాజ్ భవన్ లో బోనాల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాజ్‌భవన్ లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈనేథ్యంలో.. బోనాల పండుగలోభాగంగా.. గవర్నర్ తమిళసై అమ్మవారికి కోసం స్వయంగా బోనమెత్తారు. గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో పండుగలో పాల్గొన్నారు. రాజ్ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళసై బోనాల పండుగను…
జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విధానాన్ని తీసుకురావడం కాదు.. దానిని ఆచరించాలని ఆమె సూచించారు. విద్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్దికి విద్య అనేది ఎంతో అవసరమన్నారు. ‘ఉన్నత విద్యపై జాతీయ విద్యా విధానం-2022 యొక్క ప్రభావాలు’ అనే అంశంపై హైదరాబాద్ హైటెక్స్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగించారు. చదువును మధ్యలో ఆపేవాళ్లను చాలావరకు తగ్గించగలిగామని గవర్నర్ వెల్లడించారు. కానీ…
రాష్ట్రంలో మహిళల పై ప్రతీరోజు ఎదో ఒక చోట అత్యాచారాలు, దాడులు జరుగుతూనేవున్నాయి. చిన్నపిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా విచక్షణారహితంగా మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని,ఇంతజరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుందని .. BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి తెలిపారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. కానీ ఇందుకు ప్రభుత్వం గాని…
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట.. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్…
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…
జూబ్లీ హిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన పై ఆరా తీశారు. పూర్తి నివేదికను అందజేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రెండురోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. జూబ్లీహిల్స్ రోడ్ లోని అమ్నీషియా…
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి…
రాజ్ భవన్ పాఠశాల మ్యాగజైన్‌ను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు రూపొందించిన సాహిత్య, కళాకృతుల సంకలనాన్ని ఆలకించారు. మ్యాగజైన్ లో రాజ్ భవన్ పాఠశాల 2017 నుండి 2022 వరకు సాధించిన విజయాల ప్రస్తావన వుంటుందని గవర్నర్ తమిళి సై తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి మ్యాగజైన్స్ ఉపయోగపడుతాయని అన్నారు. నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని పేర్కొన్నారు. రోటీన్ గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల…