తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో మాట్లాడితే సరిపోతుంది. కేంద్రం-తెలంగాణ ఘర్షణ పడితే మంచిదికాదన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు ప్రొఫెసర్ కోదండరాం.
తెలంగాణ దేశంలో అంతర్భాగం. ప్రజల ప్రయోజనాల రీత్యా మేం చెప్పే సలహాలు, సూచనలు పరిశీలించడానికి ప్రభుత్వానికి తీరిక లేదు. మేం చెప్పింది వినలేదు. ఉద్యమంలో చెప్పింది ఒకటి. చేసింది ఒకటి. బయట వుండి చెబితే కుదరదు. మాతో లేనివారు వ్యతిరేక శక్తులని భావించే వారు. మేం కుర్చీలు అడగలేదు. కీర్తి కీరిటాలు కోరలేదు. కేసీఆర్ కి తెలియకుండా సోనియాను కలవడం అనేది జరిగి వుండవచ్చు. తెలంగాణ ఇవ్వమని సోనియాను అడిగాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మా అభిప్రాయాలు తెలుసుకున్నారు. మేం ఎవరికీ మద్దతివ్వలేదు. రాజకీయాలకు దూరంగా వుండాలని దూరంగా వున్నాం. కాంగ్రెస్ వారు కూడా మేం సహకరించాం. మీరూ మాకు సహకరించాలన్నారు. కానీ మేం అలా కుదరదని చెప్పాం అన్నారు కోదండరాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. అన్ని పార్టీలు కలిసి ముందుకెళితే బాగుంటుందన్నారు కోదండరాం.
తెలంగాణ జన సమితిని విలీనం చేస్తారనే వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పష్టమైన బదులిచ్చారు. విలీనం అనేది చర్చే లేదు. ఆప్ లో విస్తరిస్తున్న వేళ టీజెఎస్ తో కలిసి నడుస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఆప్ తో చర్చ జరగలేదు. కలవాలి, మాట్లాడాలని అనుకున్నాం. వాళ్ళ ఆలోచన ఎలా వుంది, మా ఆలోచన ఎలా వుంది అనేది చూడాలి. గతంలో అనేక పార్టీలతో కలిసి పనిచేశాం. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ లతో కలిసి పనిచేశాం. టీజేఏసీలో వున్న యాక్టివ్ నెస్ పార్టీ విషయంలో లేదు. నెట్ వర్క్ గతంలో కంటే ఎక్కువగా వుంది. పార్టీకి క్యాడర్ బాగానే ఉంది. ఎన్నికల్లో పోటీచేయాలంటే భారీగా డబ్బు వుండాలనే భావన ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం.
రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. ప్రజలకు అవగాహన కలిగించాలి. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కలిసి పనిచేయడం అంత సులభం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి వస్తారని అనుకోవడం లేదు. ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం. మా అస్థిత్వం వదులుకుని పనిచేయడం అనేది సాధ్యం కాదని అనేకసార్లు చెప్పాం అన్నారు కోదండరాం.
కేసీఆర్ దేశ రాజకీయాలు మార్చే పనిలో వున్నారు. తెలంగాణలో ఆయన వ్యవహారం బాగా నడిపితే కలిసి వచ్చే అవకాశం వుంటుంది. ఆయన్ని ఎవరూ నమ్మరు. వ్యతిరేకతను తగ్గించుకోగలరు. దేశరాజకీయాల్లో పెద్దవారితో కలిసి పనిచేస్తే ఆయన బలం పెరిగే అవకాశం వుంది. బలమయిన నేతలతో కలిసి పనిచేస్తే ప్రయోజనం వుంటుంది. కానీ కేసీఆర్ హైదరాబాద్ ని వదిలి వెళ్ళడన్నారు ప్రొఫెసర్ కోదండరాం.