నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నరర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ విద్యా సంస్థలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. 19 విద్యాసంస్థలలో 30 వేల మంది విద్యార్థులను చదివించడం గొప్ప విషయమని గవర్నర్ అన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ఆదాయం పేద, మధ్య తరగతి అమ్మాయిల చదువుకు ఉపయోగపడుతుందన్నారు. Read Also:మిఠాయిలు పంచుకున్న భారత్-పాక్ సైనికులు నో మాస్క్, నో ఎంట్రీ రూల్ పాటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. గవర్నర్ దంపతుల ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి దంపతులు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలో బాధపడుతున్న గవర్నర్‌ను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని రోజుల క్రితం బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడ్డారు. హైదారాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, పోస్ట్ కరోనా తరువాత మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక ఏపీ వచ్చారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. గతంలో నరసింహన్ గవర్నర్ గా సమయంలో రాజ్ భవన్ కు.. సీఎం ఆఫీస్ కు మధ్య మంచి సంభందాలు ఉండేవి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత రెండింటి మధ్య గ్యాప్ పెరిగిందా..? అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… దానిని దూరం అని నేను చెప్పను. అలాగే దగ్గరగా ఉన్నం అని కూడా చెప్పను. అయితే నరసింహన్ గారు ఇక్కడ…
గవర్నర్ కొటాలో ఎమ్మెల్సీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకు నిన్నటి రోజున కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన ప్రతిపాదనలను గవర్నర్‌కు సిఫారసు చేశారు. కేబినెట్ సిఫారసులకు గవర్నర్ ఈరోజు ఆమోదం తెలిపారు. త్వరలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. ఇటీవలే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. హుజురాబాద్ నుంచి అవకాశం వస్తుందని అనుకున్నా,…
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం…
తమిళనాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి తొలగించారు. వారిలో రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తి…
ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై గవర్నరుకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేసారు. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పని తీరు దారుణంగా ఉందంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు పయ్యావుల. రూ. 40 వేల కోట్ల ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహాణ సరిగా లేదంటూ పయ్యావుల సంచలన ఆరోపణ చేసారు. గత రెండేళ్లల్లో ఆర్ధిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నరుకు దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల… రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను తొలగించాలంటూ కేంద్రానికి మూడు లేఖలు రాశామన్నారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ ధన్‌కర్ అవినీతిపరుడని, 1996కు చెందిన హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జ్‌షీట్లు కూడా ఉన్నాయని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్‌ను తొలగించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా బహిరంగంగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగాల్ అల్లర్లకు సంబంధించి కేంద్రానికి గవర్నర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గవర్నర్‌ను వెంటనే వెనక్కి…
ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై తో భేటీ కానున్నారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ పిలుపు మేరకు గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రం అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు పాల్గొంటారు. దేశంలో కరోనో వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ…