Vishnuvardhan Reddy: ఏపీలో శాంతిభద్రతల వైఫల్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రులను మార్చడం కాదు.. ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి. నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం అన్నారు.
రాష్ట్రం లో చిన్న ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా అన్నారు. హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా. గవర్నర్ ను కలిసి రాష్ట్రం లో పరిస్థితి ని వివరిస్తాం. ఏది జరిగినా గంటలో మీడియా ముందుకు వచ్చే మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు వీటి పై మాట్లాడరా? ఉద్దేశపూర్వకంగా వైసిపి నేతలు స్పందించకుండా డైవర్ట్ చేస్తున్నారు. సంఘటనల పై సిఎం, హోం మంత్రి సమీక్ష ఎందుకు చేయలేదన్నారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
క్రైం రేటులో, శాంతిభద్రతల విఘాతంలో ఏపీ ముందు వుంది. దేశ వ్యాప్తంగా నేడు ఏపీలో అరాచక పరిస్థితి గురించి చర్చించుకుంటున్నారు. రాష్ట్రం లో మహిళలకు రక్షణ లేదు.. అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే వాటికి పొంతనే ఉండదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోగా, ఉన్న వారిని తొలగించారు. మూడేళ్లలో ఎంత మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలి.
ఏపీలో ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతుంది. అందుకే కొత్తగా విద్యుత్ మీటర్లను అమలు చేస్తున్నారు. విపక్ష పార్టీ లు జగన్ మాయలో పడకండి.
ఏ రాష్ట్రమూ కొనుగోలు చేయని విధంగా ఎపి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు చూసి ఇంట్లో ఫ్యాన్ కూడా వేయలేక పోతున్నారు. ఇంట్లో తిరగని ఫ్యాన్ చూసి.. ఈ పార్టీ కి ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వైసీపీని మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి తరిమి కొట్టాలి. రాష్ట్రంలో సింహాలను చూసి ప్రజలు భయపడుతున్నారు. సింహాల గుంపు అడవిలో ఉండాలి… మిమ్మల్ని తరమాలనే ప్రజలు చూస్తున్నారన్నారు విష్ణువర్థన్ రెడ్డి. మా పొత్తుల పై వైసీపీ నాయకులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. సజ్జల గారూ… మీ ప్రభుత్వం చేసిన మోసాలు అందరికీ అర్దమయ్యాయి. మీ పాలన గొప్ప అనుకుంటే.. ముందస్తు ఎన్నికలకు రండి. వైఫల్యం చెందిన మీ ఎమ్మెల్యే లు ఎలా గెలుస్తారు? వైసీపీ నుండి వలసలు పెరగకుండా ఆపార్టీ నేతలు పొత్తుల ఎత్తులు వేస్తున్నారు. జనసేన, బీజేపీ ఉమ్మడిగా 2024 లో అధికారంలోకి రావడం ఖాయం. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యే లకు ఠంఛనుగా జీతాలు ఇస్తున్నారు. కష్టపడి పని చేసే సిబ్బంది, ఉద్యోగాలకు జీతాలు లేవు. పవన్ కళ్యాణ్ పై కొంతమంది అనవసర వివాదం చేస్తున్నారు.
బిజెపి తప్ప… ఇతర పార్టీ ల పేరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చెప్పారా? నేను బీజేపీ తో కలిసి ముందుకు సాగుతా అని పవన్ స్పష్టంగా చెప్పారు కదా. ఓట్ల చీలిక ఉండదంటే… ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడతారా? సజ్జల, మంత్రులు పవన్, బీజేపీ గురించి మాట్లాడుతున్నారంటే వారికి ఓటమి ఖాయమని అర్ధమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే… బీజేపీ, జనసేన లకు ఓటు వేయమనే అర్ధం అన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?