కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన జరిగింది. తణుకు పరిధిలోని సజ్జాపురంకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతం వరదలతో ఆందోళనకరంగా తయారైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తుంది. అయితే ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం వున్న గోదావరి 58 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అంచనా వేస్తున్నామని అయితే 60 అడుగులు దాటి లో వచ్చినప్పటికీ ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని , breaking news, latest news, telugu news, Godavari River, big news,…
గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం వల్ల ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి బాగా పెరుగుతోంది. గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద దోబూచులాడుతుంది .మూడు రోజుల నుంచి గోదావరి వరద పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. గత మూడు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వచ్చి చేరుతోంది. గోదావరి కి అయితే గత ఏడాది వచ్చినటువంటి వరద మాత్రం రావడం లేదు. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.. breaking news, latest news,…
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాలు వల్ల గోదావరి పెరుగుతుంది .ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకుంది. breaking news, latest news, telugu news, water flow, godavari river, big news