AP CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు సీఎం చేరుకోనున్నారు.
Also Read: Gaddar Last Rites: ప్రజాగాయకుడు అస్తమయం.. బౌద్ధ ఆచారం ప్రకారం గద్దర్ అంత్యక్రియలు
వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం రామాలయంపేట గ్రామం తానేలంకకు సీఎం జగన్ చేరుకోనున్నారు. అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేటలో బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. వారి గోడును తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.