ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వేషాల కారణంగా గోదావరిలో వరద ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ నిర్మాణం కావడంతో బ్యాక్ వాటర్ లో నీటి మట్టం పెరిగి ముంపు ప్రాంతాల ప్రజలు భయం పట్టుకుంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తునం అంటున్నారు చీఫ్ ఇంజనీర్ సుధాకర్.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల…