Sabari – Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద…
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామం గోదావరి తీరంలో ఉన్న ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ వృక్షం, గతంలో 300కి పైగా చిత్రాలలో కనిపించి దర్శకులు, నటులను ఆకట్టుకుంది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహా వృక్షం రెండుగా చీలి నేలవాలిపోయింది. దీంతో చెట్టును సినిమాలలో చూసిన వారు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టును రక్షించాలని పలువురు విజ్ఞప్తులు…
Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
Godavari Flood: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి లక్ష 51 వేల క్యూసెక్కులు మిగులు జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 8.90 అడుగులుగా నమోదు అయ్యింది. బ్యారేజ్ నుండి వ్యవసాయ అవసరాలకు తూర్పుడెల్టాకు 3800 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2100 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 4700 క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి ప్రాజెక్టులో…
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…
CM Revanth Reddy : ఢిల్లీ వేదికగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్…
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు…
Ap- Telangana : ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ స్టార్ట్ అయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కూడా చర్చ జరగబోతోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని శాలువాలు కప్పుకున్నారు. ఈ సమావేశంలో సీఎంలతో…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
Jagadish Reddy : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై…