గోదావరి పరివాహక ప్రాంతం వరదలతో ఆందోళనకరంగా తయారైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తుంది. అయితే ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం వున్న గోదావరి 58 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అంచనా వేస్తున్నామని అయితే 60 అడుగులు దాటి లో వచ్చినప్పటికీ ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని , ప్రజలకు భరోసా గా ఉన్నామని అంటున్నారు భద్రాచలం ఏఎస్పీ పరితోష్. గోదావరి వరద ఉద్రతి పెరగడంతో గోదావరి ఎగువ భాగంలో జాతీయ రహదారి స్తంభించిపోయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు సమీపంలో ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలో హైదరాబాదు, వరంగల్ నుంచి చత్తీస్ గడ్, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ,ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారిపై నీళ్లు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చిన లారీలు అన్నీ కూడా రోడ్లమీద చిక్కుకొని పోయాయి భద్రాచలం నుంచి చెట్టు వరకు మధ్య మధ్యలో లారీలన్నీ నిలిచిపోవడంతో గోదావరి ఇంకా పెరుగుదల కనిపిస్తుండతో ఆ లారీలు అన్నిటిని కూడా తిరిగి భద్రాచలం వైపు మళ్ళిస్తున్నారు.
Also Read : Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో గోదావరి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఏడాది 2022లో ఊహించిన రీతిలో 71.3 అడుగుల నీటి ప్రవాహం ప్రవహించడంతో భద్రాచలం ఏజెన్సీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాడు ఎదుర్కొన్న పరిస్థితులతో ముందస్తు చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వాయుసేనకు సంబంధించిన రీస్కీ చాపర్ ను జిల్లాకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి స్కూల్ నందు సిద్ధంగా ఉన్న ఈ చాపర్ ని ఉపయోగించి ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.
Also Read : Viral Video: బాహుబలి కారును మీరెప్పుడైనా చూశారా.. చూస్తే అవాక్కవాల్సిందే..!