Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowleswaram Barrage: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి బాగా పెరుగుతోంది. గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 13 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనితో బ్యారేజీ దిగువన లంక గ్రామాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. లంక గ్రామాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఎగువ ప్రాంతాలతో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద నీటిమట్టం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. దీనితో బ్యారేజీ వద్ద గోదావరి మరికొంత మేరకు వరద ఉద్ధృతి పెరిగి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
మరోవైపు, అధికారులను ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయక చర్యల్లో 3 ఎన్‌డీఆర్ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇక అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఉండనున్నాయి. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?