భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాలు వల్ల గోదావరి పెరుగుతుంది .ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరుగుతే 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక చారి చేస్తారు. అయితే ప్రస్తుతం భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయ్యారు .
Also Read : BJP Leaders House Arrest : ఎక్కడికక్కడ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మళ్ళీ గోదావరి కి ఎంత మేరకు వరదలు వస్తాయనేది ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతుంది. ప్రస్తుతం ఉన్న వరద స్పీడ్ గా దిగువకు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చని అధికార యంత్రం భావిస్తుంది.
Also Read : IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి రానప్పటికీ కరకట్ట వైపు నుంచి లీకేజీ వాటర్ తో ఇబ్బందులు తప్పడం లేదు. 39 అడుగులు గోదావరిలకు వస్తే కరకట్టకు సంబంధించిన లాక్ చేయడం ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తుంటారు .ఇప్పుడు అదే విధంగా చేయడంతో కరకట్ట వెంట నీరు చేరుకుని పోయింది. అయితే ఈ నీరు అంతా నగరంలో గత రాత్రి భారీ వర్షం వల్ల వచ్చిన డ్రైనేజీ వాటర్ అని అధికారులు అంటున్నారు.
Also Read : ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లోకి రోహిత్ శర్మ
అయితే ఈ వాటర్ ని గోదావరి లోకి పంపింగ్ చేయడంలో అధికారులు ఇరిగేషన్ శాఖ వైఫల్యం చెందిందని ప్రజానీకం ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గోదావరి కి ఇంకా 41 అడుగులు కూడా రాలేదు.. ఇప్పుడే ఇంత సమస్య వస్తే అధికారులు ఏమి చేస్తున్నారని అంటున్నారు. గోదావరికి గత ఏడాది వచ్చిన వరదల దృష్ట్యా కనీసం పాఠాలు నేర్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఫలితంగానే మోటార్లు పని చేయక పోవటం వల్ల స్లూయిస్ వద్ద డ్రైనేజీ వాటర్ పేరుకుని పోయి ప్రజలు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని భద్రాచలం పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.