AP CM Jagan: పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan; గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం వల్ల ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితులను సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 42 మండలాల్లో, 458 గ్రామాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. సహాయచర్యల్లో 3 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Also Read: Health Department: అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెలవులు రద్దు
Also Read
అంతేకాక భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల్లోని వివరాలనుకూడా సీఎంకు వెల్లడించారు. గోదావరి నదికి ఆనుకునిఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని సీఎంకు చెప్పారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామని సీఎంకు వివరించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం గ్రామాల్లో అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
Also Read: MLA Seethakka: అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క
సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని, తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆమేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వరదప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం సీఎం ఆదేశాల మేరకు ముందస్తుగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశామని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!