కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెడుతోంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలోని కరువు స్థితి గతులను గవర్నర్‌కు విన్నవించడం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
ప్రియాంక గాంధీ సమక్షంలో అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు.
ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి "కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ" (సీడబ్ల్యూసీ) సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీలో అమలు కాని 10 కేంద్ర ప్రభుత్వ హామీలను గురించి తెలిపారు.
Gidugu Rudraraju: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త అర్థం చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన భారత్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గిడుగు రుద్రరాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు.. జగన్.. పవన్ అంటూ సెటైర్లు వేశారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మునిగిపోతున్న నావగా పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందన్నారు.. మరోవైపు, కర్నాటకలో బీజేపీ…