Gidugu Rudraraju: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త అర్థం చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన భారత్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గిడుగు రుద్రరాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు.. జగన్.. పవన్ అంటూ సెటైర్లు వేశారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మునిగిపోతున్న నావగా పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందన్నారు.. మరోవైపు, కర్నాటకలో బీజేపీ పతనం ఖాయం అని జోస్యం చెప్పారు.. బీజేపీ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు..
Read Also: Jagga Reddy: జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు.. రేవంత్ కు దక్కని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లోనూ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు అంతా తిరిగి చేరాలని పిలుపునిచ్చారు గిడుగు రుద్రరాజు.. 2024 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. మరోవైపు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవ విషయాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికైనా పురోగతి కనిపిస్తుందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.