AP Congress: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలోని కరువు స్థితి గతులను గవర్నర్‌కు విన్నవించడం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు. 685 మండలాలకు 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని.. 450 మండలాలు కరువుతోటి అల్లడుతున్నాయన్నారు. కేంద్రంతో కుమ్మకై 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. కరువు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు.
Read Also: Perni Nani: కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
తీసుకున్న రుణాలు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అప్పుల బారినపడి ఆత్మహత్యలు చేసుకున్న వారికి రూ.25 లక్షల నష్ట పరిహరం అందించాలని కోరారు. ఎకరాకు 50 వేల నష్ట పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కవులు, రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వలసలు నివారించే విధంగా ఉపాధి హామీ పనులు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇవి ప్రధాన డిమాండ్లుగా గవర్నర్‌కు రిప్రజంటేషన్ ఇచ్చామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.