AP Elections Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎలక్షన్స్‌కి సమయం దగ్గర పడుతోన్న వేళ.. కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది.. మరోవైపు ఇప్పటి వరకు జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. తాము తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం.. ఆ తర్వాత టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడం చూస్తున్నాం.. అయితే, టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనేది తేలాల్సి ఉంది.. ఇక, ఏపీలో “ఇండియా” పక్షాల కూటమి పొత్తులపై కసరత్తు మొదలైంది..
Read Also: Doctor Punches Patient: ఆపరేషన్ సమయంలో పేషెంట్‌పై దాడి చేసిన డాక్టర్.. వీడియో వైరల్..
కాంగ్రెస్, వామ పక్షాలు కలిసి పోటీ చేసే అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ లో సుదీర్ఘ సమాలోచనలు చేశారు కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మధ్య ఈ రోజు మంతనాలు జరిగాయి.. ఏపీలో రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల పై కాంగ్రెస్, సీపీఐ సమాలోచనలు చేస్తుంది.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు (కాంగ్రెస్, సీపీఐ).. సీపీఎంతో కలసి పోటీ చేసే అంశంపై చర్చలు సాగినట్టుగా చెబుతున్నారు.. “ఇండియా” కూటమి తరపున ఏపీలో పోటీ చేసి సత్తా చూపాలని యోచనలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయట.
Read Also: Venkatesh Maha: అన్న.. మళ్లొచ్చినాడు..
ఇక, ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయన్నారు.. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయన్న ఆయన.. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి.. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే అన్నారు. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్లాలి అన్నది మా ఉద్దేశం అన్నారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశాలు ఎంత వరకు ఉంటాయని చూడాలి.. కానీ, వారితో టీడీపీ-జనసేన కూడా కలిసి వస్తుందా? అనేది వేడిచూడాల్సిన అంశం.