Mosquito Bite: దోమలతో వ్యాధులు రావడం సహజం. దోమలు కుడితే డెంగీ లేదా మలేరియా వంటి వ్యాధులు సోకుతాయి. కానీ దోమ కుడితే కోమాలోకి వెళ్లి 30 సర్జరీలు చేయించుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా. ఊహించడం కాదు ఏకంగా ఇది నిజజీవితంలో చోటుచేసుకుంది. జర్మనీలో ఈ ఘటన జరిగింది. రోడెర్‌మార్క్ అనే ప్రాంతంలో 2021 వేసవిలో సెబాస్టియన్ అనే 27 ఏళ్ల వ్యక్తికి ఆసియా టైగర్ దోమ కుట్టడంతో సాధారణ జ్వరం వచ్చింది. దీంతో అతడు…
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.…
German intervention in the Kashmir issue is not necessary Says India: జమ్మూ కాశ్మీర్ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి చేసి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ పై జర్మనీ అనుసరిస్తున్న వైఖరిని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశంలో…
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఫ్లైట్ ఎక్కారని.. దాంతో విమాన సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు.. విమానం నుంచి దించేశారు.. ఈ పరిణామాలతో విమానం ఆలస్యంగా బయల్దేరిందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాగి ఉన్నారనే ఆరోపణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టనున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.. పంజాబ్ సీఎం…
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలపై తారు చిక్కగా మారుతోంది. దీంతో విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే యూకేలో ఎండల కారణంగా రైళ్లను నిలిపివేశారు.…
చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఒప్పో, వన్ ప్లస్…
ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 51 దేశాల్లో 5 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే యూరప్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యూరప్ లో గత రెండు వారాల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్ దేశాలకు సూచించింది. ప్రపంచంలో నమోదైన కేసుల్లో…
ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది రష్యా. ఫిబ్రవరిలో ప్రారంభమై యుద్ధం ఐదు నెలలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ముఖ్యంగా డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పట్టు సాధిస్తోంది. అక్కడి నగరాలను నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గత మూడు వారాలుగా కీవ్ పై ఎలాంటి దాడి…
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని.. 47 ఏళ్ల క్రితం భారతీయుల డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని ప్రయత్నించారని.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో నల్లని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం మరియు సంప్రదాయాల వైవిధ్యం మన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని ఆయన అన్నారు. జీ-7 దేశాల సమావేశం కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని అక్కడ మ్యూనిచ్ నగరంలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. సుస్థిర వాతావరణ పద్ధతులు భారతదేశ ప్రజల జీవితాల్లో…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి…