Germany: దెబ్బకొట్టిన ‘నోకియా’.. అక్కడ వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఒప్పో, వన్ ప్లస్ సంస్థలు నోకియాతో ఒప్పందం చేసుకోకుండా, నోకియా నుంచి ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండా ఈ టెక్నాలజీని వాడుతున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో నోకియా కంపెనీ గత ఏడాది జూలైలో యూరప్‌లోని పలు దేశాల్లో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది.
Read Also: Work From Home: ఆ దేశంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగుల హక్కు.. ఇవ్వకపోతే నేరమే..!!
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
తాజాగా నోకియా ఫైల్ చేసిన కేసుపై మాన్‌హీమ్ కోర్టు విచారించి తీర్పు వెల్లడించడంతో జర్మనీలో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం లేదు. అయితే కోర్టు తీర్పును తాము హైకోర్టు సవాల్ చేస్తామని ఒప్పో వెల్లడించింది. తమ సంస్థ సొంత, థర్డ్ పార్టీలకు చెందిన టెక్నాలజీలను గౌరవిస్తుందని.. మొబైల్ తయారీ పరిశ్రమలో లైసెన్సింగ్ సహకారానికి ఒప్పో కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పిటిషన్‌లు, లా సూట్ల ద్వారా లబ్ధి పొందే విధానాన్ని ఒప్పో వ్యతిరేకిస్తుందని తెలిపింది. అటు నోకియా కంపెనీ గతంలో కూడా యాపిల్, లెనోవాలపై లాసూట్ ఫైల్ చేసింది. వీటికి సంబంధించి రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని నోకియా కంపెనీకి చెందిన ఎన్‌ఎస్‌ఎన్, అల్కాటెల్-లూసెంట్ అనే సంస్థలకు యాపిల్ చెల్లించింది.
- Tags
- germany
- Nokia
- ONE PLUS
- Oppo
- Technology
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!