చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలపై తారు చిక్కగా మారుతోంది. దీంతో విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే యూకేలో ఎండల కారణంగా రైళ్లను నిలిపివేశారు. దీంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కార్చిచ్చు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే మొదటిసారిగా అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తున్నామని అక్కడి ఫైర్ సర్వీస్ సిబ్బంది వెల్లడిస్తోందంటే.. అక్కడ ఉష్ణోగ్రతలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ వ్యాప్తంగా జనాలు ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Red Also: MP K Laxman: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం
యూకేలో ఎండల వల్ల ప్రయాణాలు, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాల్లింది. స్కూళ్లను మూసేశారు. రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు. బుధవారం లండన్ హీత్రూ విమానాశ్రయంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 2019లో నమోదైన 38.7 డిగ్రీల రికార్డును బద్ధలు కొట్టింది. లండన్ పరిసరాల్లో ఉన్న గడ్డి భూముల్లో మంటలు సంభవిస్తున్నాయి. ఇక మరో యూరప్ దేశం స్పెయిన్ దేశంలో వడగాలుల కారణంగా వారంలో 679 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్ లో 6500 హెక్టార్ల అడవులు కాలిపోయాయి. దాదాపుగా 30 వేల మంది ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. డెన్మార్క్ దేశంవలోొ రికార్డు స్థాయిలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1975లో చివరిసారిగా ఆ దేశంలో 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక జర్మనీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న భారీ ఉష్ణోగ్రతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అక్కడి రైతు సంఘం అధ్యక్షుడు హెచ్చరించారు.