Mosquito Bite: దోమలతో వ్యాధులు రావడం సహజం. దోమలు కుడితే డెంగీ లేదా మలేరియా వంటి వ్యాధులు సోకుతాయి. కానీ దోమ కుడితే కోమాలోకి వెళ్లి 30 సర్జరీలు చేయించుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా. ఊహించడం కాదు ఏకంగా ఇది నిజజీవితంలో చోటుచేసుకుంది. జర్మనీలో ఈ ఘటన జరిగింది. రోడెర్‌మార్క్ అనే ప్రాంతంలో 2021 వేసవిలో సెబాస్టియన్ అనే 27 ఏళ్ల వ్యక్తికి ఆసియా టైగర్ దోమ కుట్టడంతో సాధారణ జ్వరం వచ్చింది. దీంతో అతడు లైట్ తీసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు అతడి రక్తం విషంగా మారింది. కాలేయం, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు సరిగా పనిచేయలేదు. దీంతో నాలుగు వారాలు సెబాస్టియన్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఏదో అదృష్టం ఉండబట్టి బతికి బయటపడ్డాడు.
Read Also: Team India: పంత్.. ఇదేం ఆటతీరు? ప్లీజ్ రెస్ట్ తీసుకో..!!
కాగా దోమ కుట్టిన చోట సెబాస్టియన్ శరీరంపై గడ్డ ఏర్పడింది. ఈ గడ్డను తొలగించుకునేందుకు అతడు ఏకంగా 30 సర్జరీలు చేయించుకున్నాడు. దీంతో అతడు తన ఎడమ కాలిలో సగం తొడను కోల్పోయాడు. ఇన్ని సర్జీల కారణంగా తాను మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దోమ కారణంగా తాను చాలా కాలం దారుణమైన నరకాన్ని అనుభవించానని తెలిపాడు. ఎక్కడికీ కదలిందుకు వీలు కాలేదని వివరించాడు. కాగా ఆసియన్ టైగర్ దోమ కుట్టడమే ఈ సమస్యకు మూలకారణమని వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి దోమల కుట్టడం పట్ల జాగ్రత్తగా ఉండాలని సెబాస్టియన్ ఇతరులను హెచ్చరించాడు. పగటిపూట కుట్టే ఆసియన్ టైగర్ దోమను సాధారణంగా అటవీ దోమ అని పిలుస్తారని వైద్యులు చెప్పారు. ఈ దోమ ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE), జికా, వెస్ట్ నైల్, చికెన్ గున్యా, డెంగీ జ్వరం వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తుందని పేర్కొన్నారు.
Read Also: Coins In Stomach: ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్.. కడుపా లేదా కిడ్డీ బ్యాంకా ?