కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది.
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు.…
Free Ration: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో పాటు చక్కెరను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినా, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.
Free Ration: అనేక రాష్ట్రాలకు బియ్యం-గోధుమలను విక్రయించడాన్ని కొంతకాలం క్రితం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న రాష్ట్రాలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.
Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ…
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త… ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు.. తెలంగాణలో ఇవాళ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు… డిసెంబర్ వరకూ 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి మొత్తం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని…
శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా…
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. Read Also: మరిన్ని…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్…
ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు…