ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కేంద్రం అమలు చేసింది.
Read Also: భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
Also Read
అయితే ఇటీవల ఈ కార్యక్రమాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు. దీంతో ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ త్వరలో పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉచిత రేషన్ పథకం ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!