హై కోర్డులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేసింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే…
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనబడింది. కేటీఆర్‌తో పాటు, బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. HMPV Virus:…
ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి! న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.
Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.
KTR Petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థ కు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు FEO పంపడం ఉలంఘన…
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.