Harish Rao: ఫార్మలా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో రచ్చ..
- అసెంబ్లీలో ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ..
- తప్పు చేశామని, సభలో చర్చించి చెప్పాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఫార్ములా-ఇ కార్ రేస్ అంశంపై స్పీకర్ ఛాంబర్లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా-ఇ కార్ రేస్ సమస్యకు సంబంధించి రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకే ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాము తప్పు చేశామని, సభలో చర్చించి చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసిన తప్పు ఎందుకు కాదో కూడా ఈ సభ ద్వారా ప్రజలకు చెబుతాం. మీరు పెట్టినది అక్రమ కేసు కాకపోతే ఈ సభలో చర్చించాలన్నారు. తానేమీ తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారని అన్నారు.
Read also: India – US Relations: అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి..
Also Read
- HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
- Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
అక్రమ కేసు పెట్టినప్పుడు వివరించేందుకు కేటీఆర్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. 420 హామీలకు కట్టుబడి లగచర్ల రైతుల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌పై కాంగ్రెస్ కేసు పెట్టిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఫార్ములా-ఈ రేసు విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇది సభ్యునికి సంబంధించిన అంశమని, ముందుగా బిల్లులపై చర్చ జరగాలని స్పీకర్ అన్నారు. అందుకు అంగీకరించని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఫార్ములా-ఈ కార్ రేస్ పై చర్చకు పట్టుబట్టారు. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.
India – US Relations: అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!