హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
R.S Praveen Kumar : తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, అలాంటి నేతపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కేటీఆర్‌పై 14 కేసులు పెట్టారని, इनमें నాలుగు కేసులను ఇప్పటికే హైకోర్టు…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు.…
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి…
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో…
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. తాజాగా విచారణ జరిగింది.
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
KTR : తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు కోర్ట్…
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్‌ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్‌ఎన్ రెడ్డి నుండి హెచ్‌ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్‌ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్…
KTR : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) గురువారం తన నివాసం నుండి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. కేటీఆర్ వెంట ఆయన తరఫు న్యాయవాది రామచంద్రరావు, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కేటీఆర్ తన నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, తనపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలపై ఘాటైన ప్రకటన చేశారు. విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కుమారుడిగా, రాష్ట్ర…