MP Raghunandan Rao: కేటీఆర్కి ఈడీ నోటీసులపై స్పందించిన రఘునందన్ రావు..
- కేటీఆర్కి ఈడీ నోటీసులపై స్పందించిన రఘునందన్ రావు
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా..
- ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు- ఎంపీ రఘునందన్ రావు
- ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు. అందుకే కేటీఆర్ పై ఈడీ కేసు నమోదవుతుంది.. విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందనితెలిపారు. ఈడీ, మోడీ, బోడి అని నోరు పారేసుకునేటప్పుడు నోరు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని కేటీఆర్ కు రఘునందన్ రావు హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇలానే మాట్లాడిందని తెలిపారు. తనను అరెస్ట్ చెయ్యి అని ట్విట్టర్‌లో పెట్టిన టిల్లు.. కేసు కాగానే కోర్టుకి వెళ్ళాడని విమర్శించారు. ధైర్యముంటే కేటీఆర్ జైలుకి వెళ్ళాలి.. జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Asaduddin Owaisi: సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ పోస్ట్.. యోగి నిర్ణయంపై ఓవైసీ ఫైర్..
Also Read
కాగా.. ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ, ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది.
Read Also: Nitish Kumar Reddy: చాలా టెన్షన్‌కు గురయ్యా.. సెంచరీ తర్వాత నితీష్ రెడ్డి తండ్రి భావోద్వేగం..
- Tags
- ACB
- ED
- ed notices
- Formula E Race
- ktr
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!