అమ్మాలపై అఘాయిత్యాలు జరకుండా అధికారులు ఎన్నో పకడ్బంది చర్యలు చేపట్టిని ఎక్కడో ఒక చోటు వారి పై అత్యాచారాలు, లైంగికదాడులు జరుగుతూనే వున్నాయి. కానీ ఓ మాజీ మంత్రి కూడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో.. అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ.. విద్యార్ధిని పై లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విద్యార్థిపై వేధింపుల ఘటనకు సంబంధించి త్రిపురకు చెందిన బాధితురాలు డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసి ఆపై అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసుపై మాజీ మంత్రిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం త్రిపుర ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జమతియ అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని ఢిల్లీలోని త్రిపుర భవన్ జాయింట్ రెసిడెంట్ కమిషనర్ రంజిత్ దాస్ వెల్లడించారు. రాజధాని ఢిల్లీలో చదువుకుంటున్న త్రిపుర విద్యార్ధిని స్టేట్‌మెంట్‌ను ఢిల్లీ పోలీసులు రికార్డు చేసి, మాజీ మంత్రిని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Chandrababu: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ఫైర్