మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి గర్భగుడిలోనికి మంజీరా వరద ప్రవేశించింది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో భారీగా వరద వచ్చింది.
Medak Temple: మూడో రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉంది.
CM Chandrababu Review Meeting: మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయింపు చేశారు.
AP Governor: భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు.
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను అని పేర్కొన్నారు. ఇంత వరదను ఊహించలేదు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు.. అవసరమైతే మళ్ళీ వస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Vijayawada: విజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వెనక్కి ప్రవహిస్తోంది బుడమేరు వాగు.. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Rescue Operation in Vijayawada: బెజవాడ నగరంలో వచ్చిన వరదలో 2 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెళ్ళటూరు బ్రిక్స్ ఇండస్ట్రీ ఏరియాలో చిక్కుకున్న 48 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.