గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్ పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం విరుచుకుపడటంతో జన…
Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ…
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
CM Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది.
ఏపీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. దీంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లలోకి ప్రభుత్వం పరిహారం సాయం అందజేసింది.
Chandrababu Naidu: ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని ఇదివరకే అధికారులతో సీఎం సమావేశంలో తెలిపారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, అలాగే పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు తెలియచేసారు. నష్టం అంచనాలు పూర్తి…
విజయవాడలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదలకు విజయవాడ వాసులు అతలాకుతలం అయ్యారు. కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు.. వారం రోజుల పాటు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలు.. తీవ్ర ప్రభావం చూపించాయన్నారు.
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.